తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

  • 24 గంటల్లో 574 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,83,556
  • కోలుకున్న వారు మొత్తం 2,75,217 మంది
  • మృతుల సంఖ్య 1,524 
తెలంగాణలో గత 24 గంటల్లో 574 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 384 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,83,556కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,75,217 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,524కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,815 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,487 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా  109 కరోనా కేసులు నమోదయ్యాయి.


Corona Virus
COVID19
Telangana

More Telugu News